ఐస్ బ్లూ వెస్ట్రన్ వేర్లో అందాల విందు.. మృణాల్ ఠాకూర్ కొత్త లుక్స్‌కు నెటిజన్లు ఫిదా!
సీతారామం(Sitaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ తర్వాత హాయ్ నాన్న(Hi Nanna) సినిమాలో నటించి మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. అందానికి అందం, నటనకు నటన ఉన్న మృణాల్ రీసెంట్ గా బాలీవుడ్ లో హే జవానీతో ఇష్క్ హోనా హై(Hai jawani tho ishq hona hai) అనే సినిమాలో నటించింది.


ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న మృణాల్, తాజాగా ఐస్ బ్లూ కలర్ వెస్ట్రన్ వేర్ వేసుకుని దానికి కాంబినేషన్ గా హై వేస్టెడ్ ఆర్గాన్జా ట్రేప్ ప్యాంట్ ధరించింది.

ఈ డ్రెస్ లో మృణాల్ తన అందాలను లైట్ గా ఎక్స్పోజ్ చేస్తూ కనిపించడంతో కుర్రాళ్లు వాటిని తెగ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.










