పింక్ మినీ డ్రెస్ లో మృణాల్ హోయలు
సీతారామం(Sitaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతో మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా, ఎంతోమంది గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూ, కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మృణాల్ తన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా మృణాల్ ఓ మినీ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది. లైట్ పింక్ మినీ డ్రెస్ తో పాటూ మృణాల్ దానికి మ్యాచ్ అయ్యే శాండిల్స్, చేతికి ఉంగరాలు పెట్టుకుని ఎంతో అందంగా కనిపించగా, వాటిని చూసి నెటిజన్లు మృణాల్ అందాల్ని పొగుడుతూ ఆమె ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.








