జూన్ 6న ‘GTA ఇంటర్నేషనల్ ఫెస్ట్
GTA: అమెరికాలోని జార్జియాలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో ‘జిటిఎ ఇంటర్నేషనల్ ఫెస్ట్’ (GTA International Fest) వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. “చిన్న వ్యాపారాల సాధికారత” (Empowering Small Businesses) అనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
ఈవెంట్ వివరాలు..
ఈ అంతర్జాతీయ పండుగ జూన్ 6, 2026 (శనివారం) రోజు కమ్మింగ్ లోని ‘ఫౌలర్ పార్క్’ (Fowler Park, 41110 Carolene Way, Cumming GA, USA, 30040) వేదికగా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌కు వచ్చే సందర్శకులకు ప్రవేశం (Free Entry) , పార్కింగ్ పూర్తిగా ఉచితం.
ప్రధాన ఆకర్షణలు..
స్థానిక ప్రతిభావంతులతో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Performances) అలరించనున్నాయి.
ప్రపంచవ్యాప్త రుచులను అందించే గ్లోబల్ క్యూసిన్, వివిధ రకాల హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ , వెండర్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
పిల్లల వినోదం కోసం ప్రత్యేకంగా కిడ్స్ జోన్‌ను ఏర్పాటు చేశారు.
సేవా కార్యక్రమాలు..
ఈ అంతర్జాతీయ వేడుకలో భాగంగా సామాజిక బాధ్యతగా ‘నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్’ (National Breast Cancer Foundation, Inc.) భాగస్వామ్యంతో రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సదరు ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. అలాగే వేదిక వద్ద ఆన్-సైట్ అవగాహన , స్క్రీనింగ్ సమాచారాన్ని కూడా అందిస్తారు. అనివార్య కారణాల వల్ల ఆన్-సైట్ GAPI హెల్త్ ఫేర్ రద్దు చేసారు.
ఈ కార్యక్రమానికి అస్పైర్ మెడికల్ గ్రూప్, కిడ్స్ ఆర్ కిడ్స్, నెస్జీ రియాల్టీ, క్రోబో తదితర సంస్థలు స్పాన్సర్లుగా, వెండర్లుగా వ్యవహరిస్తున్నాయి. వేడుకకు తరలివచ్చే వారు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ‘కార్‌పూల్’ (Carpool) ద్వారా రావాలని జిటిఎ అట్లాంటా ప్రతినిధులు కోరారు. ఆసక్తి గలవారు ఫ్లయర్ లోని క్యూఆర్ కోడ్ లేదా అధికారిక వెబ్సైట్ (www.gtaatlanta.org / www.globaltelangana.org) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం స్పాన్సర్షిప్స్ విభాగంలో విక్రమ్ అల్లాడ, అనంత్ జోషి, బిండియా రమేష్, ప్రసాద్ కసినాధుని, కల్యాణ్ యెర్రనగు, పల్లవి శివలను సంప్రదించవచ్చు.








