జులై 17-19 టాటా మెగా కన్వెన్షన్ స్టాళ్ల బుకింగ్స్ ప్రారంభం
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘టాటా మెగా కన్వెన్షన్ 2026’ (TTA Mega Convention 2026) వేడుకలకు సర్వం సిద్ధంచేస్తోంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 17 నుండి 19, 2026 వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా, ఉత్తర అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ తెలుగు జాతీయ మహాసభల్లో తమ వ్యాపారాలు, ఉత్పత్తులు , సేవలను ప్రదర్శించాలనుకునే వారి కోసం నిర్వాహకులు స్టాళ్ల కేటాయింపు ప్రక్రియను (Stall Pricing) అధికారికంగా విడుదల చేశారు.
కేటగిరీలు..
వ్యాపారుల సౌకర్యార్థం 10×10 సైజు గల స్టాళ్లను వేర్వేరు కేటగిరీలలో అందుబాటులో ఉంచారు. జూన్ 5వ తేదీ లోపు బుక్ చేసుకునే వారికి ప్రత్యేకంగా ‘ఎర్లీ బర్డ్’ (Early Bird) డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
వివిధ కేటగిరీల సాధారణ , ఎర్లీ బర్డ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
ప్యాక్డ్ ఫుడ్ స్టాళ్లకు అత్యధికంగా సాధారణ ధర $8000 (ఎర్లీ బర్డ్ $6500) గా ఉంది. గోల్డ్ & డైమండ్ జ్యువెలరీ స్టాళ్ల ధర $6000 (ఎర్లీ బర్డ్ $5000) కాగా, స్పెషాలిటీ ఆర్టిసాన్స్ , రియల్ ఎస్టేట్ / ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ స్టాళ్ల ధరలు $5000 (ఎర్లీ బర్డ్ $4000) గా నిర్ణయించారు. అలాగే బీడ్స్ & జెమ్స్ స్టాళ్ల ధర $4000 (ఎర్లీ బర్డ్ $3000) గానూ, సిల్వర్ & ఫ్యాషన్ జ్యువెలరీ , దుస్తుల (Clothing) స్టాళ్ల ధరలు $2500 (ఎర్లీ బర్డ్ $2000) గానూ ఉన్నాయి. హ్యాండీక్రాఫ్ట్స్ , ఇతర వ్యవసాయ, విద్యా సంబంధిత స్టాళ్లను $2000 (ఎర్లీ బర్డ్ $1500) కే అందిస్తున్నారు. నాన్-ప్రాఫిట్ సంస్థల స్టాళ్లకు ఎలాంటి తగ్గింపు లేకుండా $1000 గా ధరను ఖరారు చేశారు.
దేశవ్యాప్తంగా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చే ప్రవాస తెలుగు సమాజం ముందు మీ బ్రాండ్ విలువను, వ్యాపార పరిధిని పెంచుకోవడానికి , కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ మహాసభలు ఒక అద్భుతమైన వేదికగా నిలవనున్నాయి. ఆసక్తి గల వ్యాపారులు, సంస్థలు వెంటనే తమ స్టాళ్లను రిజర్వ్ చేసుకోవాలని టాటా అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
సంప్రదించాల్సింది..
స్టాళ్ల బుకింగ్స్ , ఇతర సమాచారం కోసం చందన [+1 (469) 837-6327], భరత్ [+1 (860) 970-8983], లేదా అరుణ్ [+1 (954) 554-6286] లను సంప్రదించవచ్చునని సూచించారు. మరిన్ని వివరాల కోసం టాటా హెల్ప్‌లైన్ 1-866-TTA-SEVA లేదా అధికారిక వెబ్సైట్ www.ttaconvention.org ను సందర్శించవచ్చు.








