బన్నీ సినిమాపై లేనిపోని రూమర్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) కాంబినేషన్లో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్‌పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నిలిచిపోయిందని, ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తన టీమ్‌తో కలిసి ఫైనల్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే దశలో ఉన్నారు. ఇప్పటికే కథా ఆలోచనకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించనుండగా, ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది. కథకు తగిన పాన్ ఇండియా స్థాయి తారాగణాన్ని ఎంపిక చేయడంపై డైరెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉండటంతో, దసరా సమయానికి లోకేష్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు ఈ సినిమాను వీలైనంత త్వరగా పలు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని డైరెక్టర్, హీరో ఇద్దరూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత అనవసర విరామాలు లేకుండా షూటింగ్ జరిపి, 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో టీమ్ పనిచేస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమా పూర్తి స్థాయిలో ట్రాక్‌పైనే ఉండటం అభిమానులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.








