రాకా గ్లింప్స్ పై లేటెస్ట్ అప్డేట్
క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాకా(Raaka)పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మక విజువల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అట్లీ ప్రణాళిక ప్రకారం వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. కథ, పాత్రలు, విజువల్స్ పరంగా కొత్త అనుభూతిని అందించేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, రాకాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ప్రచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో విడుదలయ్యే ఈ గ్లింప్స్ ద్వారా రాకా ప్రపంచం ఎలా ఉండబోతోందో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కేవలం హీరో పరిచయం కాకుండా సినిమా కాన్సెప్ట్, విజువల్ స్కేల్, కథా నేపథ్యంపై ఆసక్తి పెంచే విధంగా ఈ వీడియోను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్(Sai Abhyankar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures) అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన కాస్టింగ్, టెక్నికల్ టీమ్ కారణంగా రాకాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతుండగా, ఆగస్టులో రానున్న గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







