జై హనుమాన్‌లో అశ్వత్థామగా రానా!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) విస్తరణలో భాగంగా రూపొందుతున్న జై హనుమాన్(Jai hanuman) సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ పౌరాణిక సినిమాలో రానా దగ్గుబాటి(rana daggubati) అశ్వత్థామ(Aswatthama) పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మహాభారతంలో చిరంజీవిగా నిలిచిన ఈ పాత్ర కథలో కీలక మలుపులకు కారణమయ్యేలా డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పీవీసీయూలోని పలు పౌరాణిక పాత్రలను ఒకే కథా ప్రపంచంలో అనుసంధానించే ప్రయత్నంలో అశ్వత్థామ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
హనుమాన్(Hanuman) సక్సెస్ కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రశాంత్ వర్మ(Prasanth Varma) మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈసారి విజువల్ స్కేల్, ప్రపంచ నిర్మాణం, పాత్రల డిజైన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers), టీ సిరీస్(T series) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రను పోషిస్తుండగా, తేజ సజ్జా(Teja Sajja) తన గత పాత్రను కొనసాగించనున్నాడు. షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రీ ప్రొడక్షన్, కాన్సెప్ట్ డిజైన్, విజువల్ ప్లానింగ్ కోసం టీమ్ గణనీయమైన టైమ్ వెచ్చించినట్లు తెలుస్తోంది.
రానా కెరీర్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంతకాలంగా అనౌన్స్ చేసిన కొన్ని ప్రాజెక్టులు వివిధ కారణాలతో ముందుకు సాగకపోవడంతో, ఆయన నుంచి భారీ స్థాయి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి టైమ్ లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న పౌరాణిక సినిమాలో అశ్వత్థామ వంటి పవర్ఫుల్ క్యారెక్టర్ దక్కడం ఆసక్తిని పెంచుతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి డిస్కషన్ కు దారి తీస్తోంది.








