రజనీ కలం నుంచి నిజమైన కథ.. తర్వాత బయోపిక్ కూడా?
రజనీకాంత్ జీవిత కథ మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. సూపర్‌స్టార్ తన జీవిత అనుభవాలను స్వయంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆ ఆత్మకథను బేస్ చేసుకుని ఫ్యూచర్ లో బయోపిక్ తెరకెక్కే అవకాశాలపై కూడా డిస్కషన్ సాగుతోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఫ్యాన్స్ లో మాత్రం భారీ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఓ మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసి ఇప్పుడు ఇండియన్ సినీ హిస్టరీలో మోస్ట్ పవర్ఫుల్ హీరోల్లో ఒకరిగా ఎదిగిన జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.
రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ ఇటీవల చేసిన కామెంట్స్ ఈ డిస్కషన్స్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, రజనీకాంత్ ఇప్పటికే తన ఆత్మకథ రచనను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ బుక్ లో ఆయన సినీ జర్నీతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఇప్పటివరకు బయటకు రాని అనేక అనుభవాలు చోటు చేసుకునే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. గతంలో ఆయనపై పలు జీవిత చరిత్రలు ప్రచురితమైనప్పటికీ, స్వయంగా ఆయన పెన్ నుంచి రానున్న రచన కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇదే ఆత్మకథ తర్వాత వెండితెరపై బయోపిక్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఒకవేళ బుక్ ముందుగా పూర్తైతే, అదే సినిమాకు బలమైన కథా ఆధారంగా మారే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పుస్తకమే ముందుగా రిలీజవుతుందా? లేదా నేరుగా బయోపిక్ అనౌన్స్మెంట్ వస్తుందా అనే అంశంపై క్లారిటీ లేదు. రాబోయే రోజుల్లో రజనీకాంత్ ఫ్యామిలీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.








