యశ్ ఫ్యాన్స్‌కు ఊరట.. ‘టాక్సిక్’పై అసలు నిజం బయటకు!
రాకింగ్ స్టార్ యష్(Yash) నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ టాక్సిక్(Toxic) గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చిత్రబృందం గట్టి సమాధానం ఇచ్చింది. సినిమా కంటెంట్‌పై యశ్ అసంతృప్తిగా ఉన్నారని, భారీ స్థాయిలో రీషూట్స్ చేయాలని సూచించారని వచ్చిన వార్తలను మేకర్స్ పూర్తిగా ఖండించారు. అంతేకాకుండా, రీషూట్స్ కోసం అదనంగా భారీ బడ్జెట్ ఖర్చు చేయాల్సి వస్తోందన్న ప్రచారం కూడా వాస్తవానికి దూరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం టాక్సిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయని, ఫైనల్ వెర్షన్ సిద్ధంగా ఉందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నాన్ థియేట్రికల్ డీల్స్‌ను ముగించే పనిలో నిర్మాతలున్నట్లు సమాచారం. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశముందని తెలుస్తోంది. రీషూట్స్ లేదా కంటెంట్ మార్పుల గురించి వస్తున్న కథనాలు పూర్తిగా ఊహాగానాలేనని, చిత్రబృందం వాటిని తీవ్రంగా ఖండించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో టాక్సిక్ రిలీజ్‌పై అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు కొంతవరకు తెరపడినట్లైంది.
డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్(geethu mohandas) తెరకెక్కిస్తున్న టాక్సిక్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఇంగ్లీష్‌లో కూడా ఒకేసారి రిలీజ్ ఉండనున్న నేపథ్యంలో యశ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కియారా అద్వానీ(Kiara advani), నయనతార(nayanthara), హుమా ఖురేషీ(huma qureshi), తారా సుతారియా(Tara sutaria), రుక్మిణి వసంత్(Rukmini vasanth) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions), మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్(monster minds creations) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం టాక్సిక్ ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.








