రౌడీ హీరో ఒకటి రిలీజవక ముందే మరో సినిమాతో బిజీ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. రణబాలి(ranabaali) షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేసిన విజయ్.. ఆ సినిమా పనుల నుంచి పూర్తిగా రిలీవ్ అయ్యాడు. రాహుల్ సాంకృత్యాన్(rahul sankrityan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న(rashmika mandanna) హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది. దీంతో త్వరలోనే రణబాలి ప్రమోషన్స్‌లో విజయ్ సందడి చేయబోతున్నాడు.
అయితే ఓ సినిమా పూర్తైందని రెస్ట్ తీసుకునే ఆలోచనలో విజయ్ లేనట్టే కనిపిస్తోంది. రణబాలి వర్క్స్ పూర్తైన వెంటనే తన తర్వాతి సినిమా రౌడీ జనార్దన(rowdy janardhana) షూటింగ్ కోసం విజయ్ మంగళూరుకు వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. రవి కిరణ్ కోలా(ravi kiran kola) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోని ఎంటర్టైనర్గా రూపొందుతోంది. కీర్తి సురేష్(keerthy suresh) ఇందులో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
దిల్ రాజు(Dil raju) సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(sri venktateswara creations) ఈ సినిమాను నిర్మిస్తోంది. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రౌడీ జనార్దనను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు గ్యాప్ తీసుకోకుండా పనిచేయాలని విజయ్ డిసైడ్ అయినట్టు సమాచారం. అంటే ఒక సినిమా రిలీజ్ దశకు చేరుకునేలోపే మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే విధంగా తన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నాడన్నమాట. రణబాలి ప్రమోషన్స్‌తో పాటు రౌడీ జనార్దన షూటింగ్‌ను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లనున్నాడు.








