అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
అమరావతి తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి భూమి పూజ అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• శరవేగంగా నిర్మితం అవుతోన్న అమరావతి రాజధానికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లాంటి సంస్థ రావటం గర్వకారణం
• ఇప్పటి వరకూ 3 కోట్ల కంటి చికిత్సలు అందించిన ప్రతిష్టాత్మక సంస్థ ఇక్కడ మరింతగా సేవలు అందిస్తుంది
• అమరావతిలో ఏర్పాటయ్యే ఈ ఇనిస్టిట్యూట్ ప్రపంచశ్రేణి సంస్థగా నిర్మించాలని కోరుతున్నాను
• మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్సలు అందించేలా ఈ సంస్థ ఏర్పాటు అవుతోంది
• కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ లాంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ అందించేలా నిర్మాణం చేపట్టటం సంతోషదాయకం
• జన్మభూమిలో ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థను నిర్మిస్తున్న జీఎన్ రావు, జాస్తి వెంకట్‌లకు అభినందనలు తెలియచేస్తున్నాను
• 4 రాష్ట్రాలు, 319 కేంద్రాల్లో పేదలకు కంటి వైద్యం అందించేలా ఎల్వీ ప్రసాద్ సంస్థ సేవలు అందిస్తోంది
• డిజిటల్ హెల్త్ ఐ ప్రొఫైల్ ద్వారా సకాలంలో చికిత్స అందించేలా సంస్థ పనిచేస్తోంది.
• అమరావతిలో ప్రత్యేకంగా ఐ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయటం అభినందనీయం
• ప్రపంచంలోని అత్యుత్తమ నేత్రవైద్య పరిశోధనా సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని కోరుతున్నాను
• ఇప్పుడు దేశం అంతా అమరావతి గురించి మాట్లాడుతోంది. మన అమరావతి ప్రజా రాజధాని. ప్రపంచం అంతా గుర్తిస్తోంది
• ఐదు అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటూ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం
• నోపోల్ సిటీ , బ్లూ, గ్రీన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, డీప్ టెక్ కాపిటల్ గా నిర్మిస్తున్నాం
• ఎల్ నినో ప్రభావం వల్ల కృష్ణా నదిలో నీళ్లు రాకపోయినా పోలవరం కుడికాలువ నుంచి ప్రకాశం బ్యారేజిని నీటితో నింపాం… డెల్టాకు నీరిచ్చాం
• కాలుష్య రహిత నగరంగా హరిత ప్రాంతాల అభివృద్ధితో పాటు గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా చర్యలు చేపడతాం
• గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ పై ప్రణాళికలు చేశాం.
• దేశంలోనే మొదటి క్యాంటం కంప్యూటింగ్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు అవుతోంది.
• ఐబీఎం, టీసీఎస్ ఎల్ అండ్ టీ సంస్థలు సంయుక్తంగా 133 క్యూబిట్ సామర్ధ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నాయి
• అమరావతిలో ఇప్పటికే 21 క్వాంటం స్టార్టప్‌లు సంస్థల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి
• 5 క్యాంటం కంప్యూటర్లు 3 క్యూబిట్ కంప్యూటర్లను తయారు చేశాయి.
• అక్టోబరు 3 తేదీన వివిధ యూనివర్సిటీల్లో క్యాంటం కంప్యూటర్లు ఏర్పాటవుతాయి.
• స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీలతో పాటు సెమీ కండక్టర్ క్లస్టర్ల ద్వారా డ్రోన్లు, ఇతర సాంకేతిక పరికరాలు ఉత్పత్తి అవుతాయి.
• అమరావతిలో వెట్,ఎస్ఆర్ఎం, అమృతానందమయీ సంస్థలు వచ్చాయి. త్వరలో బిట్స్ పిలానీ క్యాంపస్, ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి సంస్థలు ఏర్పాటవుతున్నాయి
• రూ.50 వేల కోట్ల విలువైన పనులు అమరావతిలో జరుగుతున్నాయి. ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లు, స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా వస్తాయి
• రాజధాని నిర్మాణం కోసం , రాష్ట్ర ప్రజల కోసం భూమి ఇచ్చిన రైతులను మరోమారు అభినందనలు తెలియచేస్తున్నాను
• ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ, రైతుల త్యాగాలు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది.
• నాలెడ్జి ఎకానమీకి, పరిశోధనకు, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతుంది
• హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ లో భాగంగా బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, ఎల్వీ ప్రసాద్ సహా ప్రముఖ సంస్థలు వస్తున్నాయి
• అమరావతిలో బ్యాంకింగ్ స్ట్రీట్‌తో ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా మారుతుంది.
• గ్రీన్ ఎనర్జీ, క్వాంటం కంప్యూటింగ్ అంశాలు ఏపీని అత్యుత్తమ స్థాయిలో నిలబెడతాయి
• ఏఐ, ల్యాబొరేటరీ ఆటోమేషన్, ఎక్సపెరిమెంటల్ బయాలజీ, క్వాంటం బయో వ్యాలీగా అమరావతి తయారవుతుంది
• అక్టోబర్ 3వ తేదీన విజయవాడలో పాన్ ఐఐటీ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం.
• దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీల్లో చదివి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన నిపుణులు అంతా మేథోమథనం చేయబోతున్నారు
• 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా నిలపాలన్న లక్ష్యం కోసం పాన్ ఐఐటీ పనిచేస్తోంది.
• భవిష్యత్తులో ఆధునిక టెక్నాలజీతో విభిన్నంగా ఆలోచనలు ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి మారుతుంది
• ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలు, ప్రపంచ స్థాయి పరిశోధనలకు గమ్యస్థానం అమరావతి
• కంటి వైద్యం పరిశోధనలో, చికిత్సలకు, శిక్షణకు ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ మారాలని ఆకాంక్షిస్తున్నాను
• సాంకేతికతను, అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరుతున్నాను.








