గులాబీ కోటలపై సీఎం రేవంత్ దండయాత్ర!
తెలంగాణలో మరోసారి హైవోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు, ఆ పార్టీ అగ్రనేతలను వారి సొంత గడ్డపైనే కట్టడి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఇదే తరహా వ్యూహం అమలు చేసింది. ఇప్పుడు అదే వ్యూహాన్నే గులాబీ పార్టీపై అమలు చేసేందుకు సీఎం రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా కన్నేశారు.
ఈ వ్యూహంలో భాగంగా ప్రతిపక్ష ముఖ్య నేతలను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వరుస బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చేనెల రెండో వారంలో హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోనూ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది.
ఈ రెండు నియోజకవర్గాల తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కేసీఆర్ అసైన్డ్ భూముల లెక్కలు, గత ప్రభుత్వ హయాంలోని భూ ఆక్రమణలపై స్పష్టమైన లెక్కలు తేలాక, గజ్వేల్‌లో బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ముందుగా స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ఆ తర్వాత పూర్తిస్థైయిలో రాజకీయ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కేవలం మాటల యుద్ధమే కాకుండా అభివృద్ధి పనులతో ప్రజల ముందుకు వెళ్లి, ఆపై ప్రత్యర్థులపై రాజకీయ దాడి పెంచాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, బీఆర్ఎస్ అగ్రనేతలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బలమైన కాంగ్రెస్ నేతలకు ఇక్కడ ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. అభివృద్ధి ఎజెండాతో మొదలై ఫైనల్‌గా పూర్తిస్థాయి రాజకీయ వ్యూహంతో ముగిసేలా ఈ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అసైన్డ్ భూముల అంశం, స్థానిక లో








