వైట్ హౌస్ కార్యక్రమాల కోసం ట్రంప్ టీవీ..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరో సంచలన, సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే ట్రంప్ టీవీ.. 24 గంటల పాటు నడిచే ఈ టీవీలో..వైట్ హౌస్ లో జరిగే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అంటే ఇక్కడి నుంచే నేరుగా ప్రసార కార్యక్రమాలు జరుగుతాయి. మిగిలిన బ్రాండింగ్ ఛానెల్స్ తో ఇక వైట్ హౌస్ కు పని లేనట్లే. ఎందుకంటే ఆయా ఛానెల్స్.. తనకు వ్యతిరేకంగా కథనాలు వండి వారిస్తున్నాయని ట్రంప్ నమ్మకం, ఆరోపణ కూడా. దీనిలో భాగంగా ఇటీవలే ఆయా ఛానెల్స్.. ట్రంప్ కార్యక్రమాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించాయి కూడా.
శ్వేతసౌధంలో జరిగే కార్యక్రమాలు, తన ప్రసంగాలు, ప్రభుత్వ ప్రకటనలు, పరిపాలనకు సంబంధించిన తాజా సమాచారాన్ని నేరుగా ప్రజలకు చేరవేసేందుకు ‘ట్రంప్ టీవీ’ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రసారాలు 24/7 కొనసాగుతాయి. మరోవైపు- తన అధికారిక కార్యక్రమాల కవరేజీని ప్రసారం చేయకూడదని పలు ఛానళ్లు నిర్ణయం తీసుకోవడాన్ని ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. న్యూయార్క్‌లో ఆయన మాట్లాడుతూ.. తననెవరూ బాయ్‌కాట్ చేయలేరని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
నిరంతరం ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపిస్తూ సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో సంస్థల విలేకరులు శ్వేతసౌధంలోకి ప్రవేశించకుండా ట్రంప్ గత వారం నిషేధం విధించారు. ఆయన చర్యను సవాలు చేస్తూ ఆ మూడు మీడియా సంస్థలు కోర్టులో దావా వేశాయి. అనంతరం- ట్రంప్ కార్యక్రమాలను ప్రసారం చేయకూడదని పలు ఛానళ్లు నిర్ణయం తీసుకున్నాయి.








