కాయదు మాటల్లో శ్రీకాంత్ ఓదెల వర్కింగ్ స్టైల్..
టాలీవుడ్ లో పర్ఫెక్షన్ కోసం ఎంతైనా కష్టపడే డైరెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. రాజమౌళి(raamouli), సుకుమార్(sukumar) లాంటి డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్ గురించి ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అదే బాటలో శ్రీకాంత్ ఓదెల(srikanth odela) కూడా తన సినిమాల విషయంలో ఏమాత్రం రాజీ పడడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఒక సీన్ అనుకున్న విధంగా వచ్చే వరకు ఎన్ని టేకులు అయినా తీసుకోవడానికి వెనుకాడనని శ్రీకాంత్ స్వయంగా చెప్పిన సందర్భం కూడా ఉంది. దీంతో ఆయనతో పనిచేసే నటీనటులు, టెక్నీషియన్లకు సెట్స్‌పై ఎదురయ్యే అనుభవాలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి.
ది ప్యారడైజ్(the paradise) లో హీరోయిన్గా నటిస్తున్న కాయదు లోహర్(kayadu lohar) తాజాగా శ్రీకాంత్ వర్కింగ్ స్టైల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఆయన సెట్లో అడుగుపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించడం కష్టమని చెప్పింది. ఒక సీన్ పూర్తయ్యాక అద్భుతంగా వచ్చిందని తాము అనుకునేలోపే శ్రీకాంత్ మరో ఆలోచనతో ముందుకొస్తాడని వివరించింది. తన ఊహకు తగ్గట్టుగా నటీనటుల నుంచి మరోసారి సీన్ ను రాబట్టే ఆయన తీరు చాలా భిన్నంగా ఉంటుందని కాయదు తెలిపింది.
ఈ సినిమా తనకు నేర్పిన అతిపెద్ద విషయం ఓపిక అని కాయదు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ టైమ్ లో ఎంత కష్టమైనా, చివరికి ఆ శ్రమ అంతా సినిమా కోసమే కాబట్టి భరించాల్సి వచ్చిందని ఆమె అభిప్రాయపడింది. స్క్రీన్ పై కనిపించే సీన్స్ ఎంత అందంగా, ఆసక్తికరంగా ఉన్నా వాటి వెనుక అంత ఈజీ జర్నీ ఉండదని ఆమె మాటల్ని బట్టి అర్థమవుతోంది. మరి శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం పెట్టిన ఈ కష్టం ది ప్యారడైజ్ లో స్క్రీన్ పై ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.








