జూన్ 7న ఏటీఏ-సియాటెల్ ‘100 మైళ్ల ఛాలెంజ్’ మెడల్స్ పంపిణీ వేడుక
ATA: అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సియాటెల్ (ATA-Seattle) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిగ్నేచర్ ఈవెంట్ “100 మైళ్ల ఛాలెంజ్” (100 Mile Challenge – One Step at a Time) విజయవంతంగా ముగిసింది. మే 1వ తేదీన ప్రారంభమై మే 31వ తేదీ వరకు సాగిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో 300 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొని తమ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలను అభినందించేందుకు , వారికి పతకాలను అందించేందుకు ఏటీఏ-సియాటెల్ కార్యవర్గ కమిటీ ఒక ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేసింది.
వేడుక వివరాలు..
- తేదీ: జూన్ 7, 2026 (ఆదివారం)
- సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
- వేదిక: మేరీమూర్ పార్క్, పిక్నిక్ ఏరియా A (Marymoor Park, Picnic Area A)
ప్రత్యేక ఆకర్షణలు..
ఈ పతకాల పంపిణీ కార్యక్రమంతో పాటు పాల్గొనే వారి కోసం 30 నిమిషాల పాటు ఉచిత ‘జుంబా సెషన్’ (Zumba Session) నిర్వహించనున్నారు. అనంతరం విచ్చేసిన వారందరికీ స్నాక్స్ , అల్పాహార వసతి కల్పించారు.
కార్యవర్గ బృందం..
- శ్రీనివాస్ రెడ్డి బండారు (ప్రెసిడెంట్)
- పరుష మర్రి (వైస్ ప్రెసిడెంట్)
- హేమంత్ గంటవరపు (జనరల్ సెక్రటరీ)
- చందు అల్లిపురం (కల్చరల్ సెక్రటరీ)
- కృష్ణ కాంత్ పసుమర్తి (ట్రెజరర్)
- సోమేష్ కుమార్ మలిశెట్టి (కమ్యూనికేషన్ & పీఆర్ డైరెక్టర్)
- సంతోష్ దూదం (జాయింట్ సెక్రటరీ)
- శ్రీనివాస్ గజవాడ (వెబ్ మాస్టర్)
ఈ వేడుకలో పాల్గొని తోటి రన్నర్స్/వాకర్స్‌తో కలిసి ఫిట్నెస్ స్ఫూర్తిని చాటాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. మరింత సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ (https://ataseattle.org/) ను సందర్శించవచ్చు.








