జూలై 17న ‘ఆరెంజ్ స్ట్రీట్’ మ్యూజిక్ బ్యాండ్‌తో టీటీఏ బ్యాంకెట్ నైట్
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మెగా కన్వెన్షన్ 2026’ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో (501 S College St, Charlotte, NC 28202) జూలై 17 నుండి జూలై 19, 2026 వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.
జూలై 17 నా..
ఈ కన్వెన్షన్‌లో భాగంగా మొదటి రోజు అనగా జూలై 17, 2026 (శుక్రవారం) రాత్రి ప్రత్యేకంగా “బ్యాంకెట్ నైట్” (Banquet Night) ను నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ప్రముఖ ‘ఆరెంజ్ స్ట్రీట్’ (Orange Street) మ్యూజిక్ బ్యాండ్ తమ అద్భుతమైన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించనుంది.
స్పాన్సర్స్..
ఈ కార్యక్రమానికి ‘రాజపుష్ప ప్రాపర్టీస్’ మెగా స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా.. అద్విత్రి గ్రూప్, ప్రైమ్ గ్రూప్, ఫస్ట్ ఇన్ఫ్రా, కివ్యో, ప్రైమ్ డెవలపర్ సంస్థలు గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
నిర్వాహకులు..
టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఈ వేడుకను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ కార్యక్రమానికి హాజరుకావాలనుకునే వారు పోస్టర్‌లోని క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లేదా www.ttaconvention.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.







