‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ ఆగస్ట్ 10న రిలీజ్
గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో సిద్ధమయ్యారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
“Comedy Goes Cosmic” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో మేళవించిన వినూత్న కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పాట ‘నా కంటి మీద కునుకే’కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్ట్ 10న టీజర్ ని లాంచ్ చేయనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో అల్లరి నరేష్ చిరునవ్వుతో కనిపించడం ఫీల్ గుడ్ వైబ్ ని తీసుకొచ్చింది.
ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరూ తమదైన కామెడీ టైమింగ్‌తో సినిమాకు మరింత వినోదాన్ని అందించనున్నారు.
ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డిజైన్‌ను రూపొందించగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్.
‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.








