ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం!
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేసులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిట్ సిద్దమైన పరిస్థితుల్లో ఓ విశ్రాంత డీజీపీ (DGP)తో పాటు మరో డీజీ (DG) ని సాక్షులుగా చేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో విచారణ సమయంలో వారి వాంగ్మూలాలే కేసును మలుపు తిప్పే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారిలో ఒకరు సుదీర్ఘకాలం పోలీస్‌శాఖలో డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందగా, మరొకరు ప్రస్తుతం ఓ ప్రధాన విభాగానికి అధిపతిగా ఉన్నారు. గత ప్రభుత్వలో వారు కీలక బాధ్యతల్లో ఉండటంతోపాటు కేసులోని ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు(Prabhakar Rao) వారి వైపే వేలెత్తి చూపిస్తున్నందున వారిని సాక్షులుగా చేర్చక తప్పదని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ (BRS) ప్రముఖుల్ని నిందితులుగా చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తుండగా తాజా పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.








