సీఎం చంద్రబాబుకు అరుదైన కానుక
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల (Chirala)లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు అన్నం మహిత (Annam Mahitha) అనే యువతి అరుదైన కానుక అందించారు. చీరాలకు చెందిన ఆమె 70 పెన్సిళ్ల ముల్లుల (లెడ్స్)పై చంద్రబాబు జీవిత చరిత్ర (Biography)ను చిన్నచిన్న అక్షరాలతో చెక్కారు. దీన్ని ఓ చిత్రపటం రూపంలో తయారు చేసి ఆయనకు బహూకరించారు. అది చూసి మురిసిపోయిన సీఎం.. యువతి కళానైపుణ్యాన్ని అభినందించారు. యువతరం ఎంత వినూత్నంగా ఆలోచిస్తుందో చెప్పడానికి మహిత ఒక నిదర్శమని ప్రశంసించారు.








