లెహంగా లో రితికా క్యూట్ స్టిల్స్
టాలీవుడ్లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఢిల్లీ భామ రితికా నాయక్(Ritika Nayak) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన యాక్టింగ్ తోనే కాకుండా, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట విపరీతంగా వైరలవుతున్నాయి. తాజాగా పాస్టెల్ పింక్ లేహంగా సెట్లో రితికా దేవకన్యలా మెరిసిపోతుంది. గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబోలో జరీ, సీక్విన్ మరియు బీడ్ వర్క్‌తో చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ ఆమెకు ఎంతో రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టింది. ఈ లుక్కు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోడవ్వడంతో ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.








