మాజీ మంత్రి అప్పలరాజుకు మరోసారి చుక్కెదురు
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaju)కు మరోసారి చుక్కెదురైంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను శ్రీకాకుళం జిల్లా సోంపేట ఆరో అదనపు జిల్లా కోర్టు తిరస్కరించింది. గత నెల 31న కూడా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు (Court) కొట్టివేసింది. గత నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆవర్ వర్మ (Avar Varma) బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య ( Danayya) మృతి చెందాడు. ఈ కేసులో కుమారుడిని రక్షించేందుకు అప్పలరాజు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. పోలీసులు ఆయన్ను ఏ3గా చేర్చారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల పలాస కోర్టు రిమాండ్‌ను మరో 14 రోజుల పొడిగించింది. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలులో ఉన్నారు.








