ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 20 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు ఐఎఫ్‌స్ (IFS ) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్ (Sai Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా జె.శ్యామలరావు (Shyamala Rao), రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్‌గా ఎం. శివప్రసాద్‌ను నియమించింది. టూరిజం, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎస్. రావత్, ఆర్కియాలజీ, మ్యూజియం విభాగం కమిషనర్‌గా రేవు ముత్యాలరాజును ప్రభుత్వం నియమించింది. పర్యాటక శాఖ బాధ్యతల్లో ఉన్న ఆమ్రపాలి (Amrapali)ని బదిలీ చేసి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.








