అంచనాలు పెంచేసిన విశాల్ ‘మకుటం’ ట్రైలర్
హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్నతొలి చిత్రం ‘మకుటం’పై ఏర్పడిన హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఫుల్ యాక్షన్ మోడ్‌తో ట్రైలర్ ఓపెన్ చేయడం.. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్‌కి షిఫ్ట్ అవ్వడం.. మూడు డిఫరెంట్ గెటప్స్‌లో విశాల్ తన మాడ్యులేషన్‌ను చూపిస్తుండటం ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. మాస్‌కి కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్, యూత్‌కి కావాల్సిన లవ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ‘ఆ సరుకుని నేను దించను.. ఇంకెవ్వరినీ దించనివ్వను రా’ అనే డైలాగ్‌ను లింగా, కృపాకర్ పాత్రల్లో విశాల్ చెప్పిన తీరు అద్బుతంగా ఉంది. ట్రైలర్లో చివరి షాట్ మాత్రం హైలెట్ అయ్యేలా ఉంది. రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం కెమెరా వర్క్ అదిరిపోయింది. దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కి కిక్కిచ్చేలా ఉన్నాయి. ఇక జీవీ ప్రకాష్ పాటలు, ఆర్ఆర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేట్టు ఉందని ఈ ట్రైలర్ చెబుతోంది. ఇక ఆగస్ట్ 14న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది.








