ఆగస్టు 7 నుండి 9 వరకు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలు
TCA: అమెరికా గడ్డపై ఐదు దశాబ్దాలుగా మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను తరతరాలకు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న ప్రతిష్టాత్మక సంస్థ ‘హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి’ (TCA) ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. సంస్థ విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ కలుపుకుంటూ భారీ ఎత్తున ‘స్వర్ణోత్సవ వేడుకలు’ (Golden Jubilee Celebrations) నిర్వహించబోతోంది.
వేడుక వివరాలు..
ఈ మూడు రోజుల ఉత్సవాలు 2026 ఆగస్టు 7వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు టెక్సాస్‌లోని రోసెన్‌బర్గ్ నగరంలో గల ‘ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్’ (FORT BEND EPICENTER – 28505 Southwest Fwy, Rosenberg, TX 77471) వేదికగా అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ముఖ్య ఉద్దేశం..
‘మన భాష మన సంస్కృతి మన సంప్రదాయం’ అనే ఉన్నతమైన విలువలను కాపాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, వివిధ కళలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు. యువతకు ప్రాతినిధ్యం కల్పిస్తూ వారిలోని నాయకత్వ లక్షణాలను వెలికితీయడం కూడా ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, గత 50 ఏళ్లుగా తెలుగువారు ప్రదర్శిస్తున్న భాషాభిమానానికి, సేవాస్ఫూర్తికి , ఐక్యతకు ఒక నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వచ్ఛంద సేవకులు (volunteers), దాతలు (donors), కమిటీ ప్రతినిధులు , పూర్వ నాయకులకు ‘TCA గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ – 2026’ కన్వీనర్ జితేందర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు వైభవాన్ని చాటిచెప్పే ఈ స్వర్ణోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సవినయంగా ఆహ్వానించారు.
నిర్వాహక కమిటీ ప్రతినిధులు..
- యాదగిరి రెడ్డి కుడుముల – ప్రెసిడెంట్ (President)
- జితేందర్ రెడ్డి – కన్వీనర్ (Convenor)
- రాజశేఖర్ యలమంచిలి – అడ్వైజరీ కౌన్సిల్ (Advisory Council)
కన్వెన్షన్ కోర్ కమిటీ (Convention Core Committee) సభ్యులు..
- శ్రీధర్ కంచనకుంట్ల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
- గిరీష్ రామిరెడ్డి (ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్)
- రాజ్ పసల (జనరల్ సెక్రటరీ)
- ప్రసాద్ మరగాని (ఈవెంట్ డైరెక్టర్)
- దామోదర్ జమ్మి (TCA ట్రస్టీ)
- ప్రసాద్ కాల్వ (కన్వెన్షన్ ట్రస్టీ)
- రాము ఉప్పలపాటి (కన్వెన్షన్ ట్రెజరర్)
- రవి గుణిశెట్టి (ఈవెంట్ కోఆర్డినేటర్)
తెలుగు చరిత్రను స్మరించుకుంటూ, రాబోయే తరాలకు వెలుగులను అందించేందుకు ప్రవాస తెలుగు వారందరూ ఈ మహాసభలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను , అప్డేట్స్ను tca50.org అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.







