బే ఏరియా – ఫ్రీమాంట్ లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి – మహానాడు వేడుకలు
బే ఏరియా లో ఫ్రీమాంట్ పట్టణం లో స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన రోజు -మే 28 న జయంతి – మహానాడు వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఫ్రీమాంట్ పట్టణం లో భీమవరం రుచులు రెస్టౌరెంట్ పూర్తి గా అన్నగారు ఎన్టీఆర్ గారి సినిమాల లోని వివిధ ఫోటో లతో ఒక పక్క, టీడీపీ మహానాడు వేడుక కు చిహ్నం గా శ్రీ చంద్ర బాబు నాయుడు, శ్రీ నారా లోకేష్ ల నిలువెత్తు ఫోటోలతో ఇంకొక పక్కా, పూర్తి ఆవరణ టీడీపీ జండాలతోను, టీడీపీ కండువాలతో సాయంత్రం నుంచే కళకళలాడుతూ ఉండేలా అలంకరించారు. ముందుగా రెస్టౌరెంట్ బయట టీడీపీ జండాలతో ఎన్నారై టీడీపీ నాయకులు శ్రీ శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీ భక్తా భల్లా, శ్రీ వెంకట్ అడుసుమిల్లి తదితరులు వచ్చిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులను సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఉత్తర అమెరికాకు ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ జయరాం కోమటి మాట్లాడుతూ బే ఏరియా చాలా విశాలమైనదని, అందుకే గత రెండు రోజులుగా మిల్పిటాస్ పట్టణం లో ఎన్టీఆర్ జయంతి – మహానాడు వేడుకలు జరిగినప్పటికీ ఈ రోజు న ఫీమోంట్ లో ఈ వేడుకలు ఏర్పాటు చేసిన శ్రీకాంత్ దొడ్డపనేని తదితరులని అభినందించారు.
శ్రీ జయరాం మాట్లాడుతూ “నేను దాదాపు 40 సంవత్సరాల క్రిందనే రావడం వలన, రెస్టౌరెంట్ బజీనెస్ అవడం వలన కొంచెం ఖాళీ టైం దొరకడం, ఎక్కువ మంది పబ్లిక్ ని కలిసే అవకాశం రావడం వలన కమ్యూనిటీ తో సంబంధ భాద్యవాలు పెరిగాయి, దానివలన సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమాల వలన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమ తో ఆకర్షణ పొంది తెలుగు దేశం పార్టీ లో చేరాను. ఇప్పుడు అమెరికా మొత్తం గా అనేక మంది ఎంఆర్ఐ లు శ్రీ చంద్రబాబు నాయుడు గారి, శ్రీ నారాలోకేష్ గారి నాయకత్వం లో పని చేస్తూ తమ వూరికి, రాష్ట్రానికి సేవ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కూడా మునుము ఎన్నడూ లేని విధంగా ఎం ఆర్ ఐ ల సేవలను గురించి ప్రోత్సహిస్తోంది. మనలో అనేక మంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లో ఎమ్మెల్యే లు గా, ఎంపీ లు గా నే కాకుండా వివిధ పదవుల్లో వుండి క్రియాశీలంకం గా పనిచేస్తున్నారు. మనతో కలిసి తిరిగి పనిచేసిన శ్రీ చంద్ర పెమ్మసాని ఈ రోజు భారత దేశ ప్రభుత్వం లో మంత్రి గా అత్యంత బాధ్యతాయుతమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఎం ఆర్ ఐ లలో కొత్త నాయకులు రావలిసిన సమయం. మీలో ప్రతి ఒక్కరు మీ మీ ఉదోగాలలో, వ్యాపారాలలో విజయం సాధిస్తున్నారు. మీరు కూడా టీడీపీ పార్టీ కి బాధ్యతతో పనిచేసి ఒక నాయకుడి గా ఎదగాలి. అమెరికాలో ఉన్న ఎన్ ఆర్ ఐ టీడీపీ నే మరింత బలోపేతం చెయ్యాలని నేను నిన్ననే మహానాడు లో నాకు ఇచ్చిన 5 నిమిషాల సమయంలో చంద్రబాబు గారికి, లోకేష్ గారికి విజ్ఞప్తి చేసాను. త్వరలో అమెరికాలో ఎం ఆర్ ఐ టీడీపీ కమిటి లను ప్రకటిస్తారు” అని చెప్పారు. శ్రీ జయరాం కోమటి ని శ్రీ శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీ భక్తా భల్లా, శ్రీ సుబ్బా యంత్ర, శ్రీ వెంకట్ అడుసుమిల్లి తదితరులు సత్కరించారు.
ఈ కార్యక్రమం లో విజయవాడ నుంచి ఆంధ్ర రాష్ట్ర ఎన్ ఆర్ ఐ శాఖా మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ వర్చువల్ గా మాట్లాడుతూ “ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఆర్ ఐ టీడీపీ సేవలను, ఎన్ ఆర్ ఐ లను ఎప్పుడూ గుర్తు పెట్టుకొని ఉంటుంది, ఎన్ ఆర్ ఐ మంత్రి గా నేను ఎప్పుడూ మీ గురించే పని చేస్తూ ఉన్నాను, రాబోయే రోజులలో ఎన్ ఆర్ ఐ ల పాత్ర మరింత పెరగాలి” అని అన్నారు.
విజయవాడ నుంచే ఏపీ ఎన్ ఆర్ టి ( APNRT ) అధ్యక్షులు శ్రీ రవి వేమూరి మాట్లాడుతూ “ఎన్ ఆర్ ఐ ల కోసం ఇంపోర్ట్ – ఎక్స్పోర్ట్ రంగాలలో అవకాశాలు కలిగించేలా కొత్త పధకాలు తీసుకు వచ్చాము. మీలో చాలా మంది ఏపీ ఎన్ ఆర్ టి మెంబర్లు గా వున్నారు. ఆ పధకాలు – అవకాశాలు వినియోగించుకోవాలి” అని అన్నారు.
విజయవాడ నుంచి శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ మాటాడుతూ “నేను న్యూ యార్క్ ఏరియా లో టీడీపీ కార్యకలాపాలు చూసేవాడిని. ఆ తరువాత పూర్తి గా ఏపీ కి షిఫ్ట్ అయిపోయి టీడీపీ పార్టీ లో సేవలు చేసే వాడిని. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చారు. మీ అందరికి ఏపీఎంఆర్టి ఇప్పటికే తిరుపతి లో దర్శనం జరగానికి కావలిసిన ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఇతర టెంపుల్స్ కి వెళ్లాలని అనుకుంటే నన్ను సంప్రదిస్తే నేను ఆ ఏర్పాట్లు చేస్తాను. మీ అందరూ రాష్ట్రానికి పార్టీకి చేస్తున్న సేవలకి అభినందనలు” అని అన్నారు.
అలాగే ఏపీ నుంచి పలాస నియోజన వర్గ ఎమ్మెల్యే శ్రీమతి శిరీష గౌతు, బే ఏరియా నుంచి ఏపీ కి వెళ్లి ఎస్ .కోట లో టీడీపీ నాయకుడు గ ఎదిగిన కృష్ణ గొంప కూడా మాట్లాడారు.
బే ఏరియా ఎన్ ఆర్ ఐ నాయకులూ శ్రీ భక్తా భల్లా, శ్రీ శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీ వెంకట్ అడుసుమిల్లి, శ్రీ భరత్ ముప్పిరాల తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నివహించడానికి ముక్యులైన శ్రీకాంత్ దొడ్డపనేని ని అందరూ అభినందించారు.







