మీర్‌పేటలో టీటీఏ, టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 5కే రన్
TTA: తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (TTA – టీటీఏ), టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ మీర్‌పేటలో నిర్వహించిన 5కే రన్ (5K Run) ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక పరుగు పందెం, ఆరోగ్య నడకను మే 24న (ఆదివారం) నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
ముఖ్య అతిథులు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు మలిపెద్ది నవీన్‌రెడ్డి హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు.

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత..
ఉదయం 6:30 గంటలకు మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాల బస్టాప్ నుండి ప్రారంభమైన ఈ 5కే రన్.. టీకేఆర్ కమాన్ వరకు సాగింది. ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షుడు మలిపెద్ది నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో నడక అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్లుగా వాకర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టీటీఏ సభ్యులు, టీకేఆర్ విద్యాసంస్థల సిబ్బంది, స్థానిక యువకులు , పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇవి కూడా చదవండి







