మే 30న డల్లాస్లో శ్రీ కోమటి జయరాం ఆత్మీయ అభినందన సభ
Dallas: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మన ప్రవాసాంధ్రుల వారధి, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి శ్రీ కోమటి జయరాంకి ఘనంగా ఆత్మీయ అభినందన సభను నిర్వహించనున్నారు. ‘ఎన్నారై టీడీపీ డల్లాస్’ (NRI TDP DALLAS) ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు కానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మక బాధ్యతలు స్వీకరించినందుకు గాను డల్లాస్లోని తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ అభిమానులు , తెలుగు సమాజం అంతా కలిసి ఈ వేడుకను నిర్వహించబోతున్నారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 30, 2026 (శనివారం)
- సమయం: సాయంత్రం 06:30 గంటల నుండి..
- వేదిక: ప్రిజం ఎట్ లాస్ కోలినాస్ (Prism At Las Colinas), 350E Royal Lane, Suite 123, Irving, TX 75039.
‘డల్లాస్ తెలుగు కమ్యూనిటీ’ (DALLAS TELUGU COMMUNITY) సౌజన్యంతో, ఎన్నారై టీడీపీ డల్లాస్ ఈ సభను నిర్వహిస్తోంది. ఈ ఆత్మీయ అభినందన సభకు డల్లాస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు , ఎన్నారైలు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎన్నారై టీడీపీ డల్లాస్ విభాగం హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది.







