జులై 12న శాన్ ఆంటోనియోలో ‘టాగ్సా’ తెలంగాణ సాంస్కృతిక వేడుకలు
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ప్రవాస తెలంగాణ ప్రజల ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాన్ ఆంటోనియో’ (TAGSA) మన గడ్డ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు సిద్ధమైంది. తెలుగు వారిని ఏకం చేస్తూ “తెలంగాణ సాంస్కృతిక వేడుకలు 2026” (Telangana Cultural Celebrations 2026) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సాహభరితమైన సంబరాలు 2026 జులై 12వ తేదీన జరగనున్నాయి.
వేడుకల ప్రధాన వివరాలు:
జులై 12, 2026
వేదిక: ష్రైన్ ఆడిటోరియం (Shrine Auditorium), 901 N Loop 1604 W, శాన్ ఆంటోనియో, టెక్సాస్ (TX 78232), అమెరికా.
ఈవెంట్ ముఖ్యాంశాలు…
తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఘనంగా బోనాల వేడుకలు. యువతను ఉర్రూతలూగించేలా డీజే డాన్స్ ఫ్లోర్. స్థానికులతో వైవిధ్యభరితమైన నృత్య, సంగీత కార్యక్రమాలు. రుచికరమైన వంటకాలతో కూడిన విందు (Delicious Food) క్యాష్ బార్ (Cash Bar) సదుపాయం ఉన్నాయి.
ఈ ఈవెంట్‌ను జాయింట్ సెక్రటరీ మదన్ కుమార్ పెదిరిగారి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ బెజ్జంకి, వెన్నెల అలుకో, శ్రీనివాస్ ముద్దసాని, నరసింహ కొమ్మిడి, అమూల్య డోకూరు, చంద్రమౌళి కందుకూరి, రాజశేఖర్ గుర్రంలతో కూడిన టాగ్సా (TAGSA) బృందం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విరాళాలు ఇవ్వాలనుకునే వారు donate@tagsa.org ఐడీకి జెల్లే (Zelle) ద్వారా పంపవచ్చు.







