చీరలో ప్రభాస్ బ్యూటీ అందాల ఆరబోత
రొమాంటిక్(Romantic) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిద్ధి కుమార్(Riddhi Kumar) తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేలా చేసింది మాత్రం రాజా సాబ్(Raaja Saab) సినిమానే. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) పక్కన హీరోయిన్లలో ఒకరిగా నటించి ఆకట్టుకుంది రిద్ధి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రిద్ధి, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఉల్లిపొర లాంటి చీర ధరించి, తన అందాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చీరకట్టులో సింపుల్ గా కనిపిస్తూనే తన అందాలను ఆరబోస్తూ దానికి మ్యాచింగ్ జ్యుయలరీని ధరించి అందరి చూపుల్ని తనవైపుకు తిప్పుకుంటోంది. రిద్ధి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.







