జూన్ 19, 20 నుంచి మటా రెండో మహాసభలు.. ముఖ్య అతిథిగా సినీ నటి జయప్రద
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “మటా 2వ కన్వెన్షన్ ’26” (MATA 2nd CONVENTION ’26) మహాసభలకు సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసారు. ఈ వేడుకలకు భారతీయ సినీ రంగ ప్రముఖురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు (MP) జయప్రద ముఖ్య అతిథిగా (Chief Guest) విచ్చేయనున్నారు.
వివరాలు..
ఈ మహాసభలు 2026 జూన్ 19 నుండి జూన్ 20 వరకు పెన్సిల్వేనియాలోని ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్’ (100 Station Ave, Oaks, PA-19456) లో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ‘xpat.money’ , ‘MSNO REALTY’ సంస్థలు మెగా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
నిర్వాహకులు..
మటా ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుద్దగి, కన్వీనర్ శ్రీధర్ గూడల, కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదెల , ఇతర కోర్ కమిటీ, అడ్వైజరీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కన్వెన్షన్ టికెట్ల కోసం పోస్టర్లోని క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేయవచ్చని లేదా సంఘం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.







