భట్టివిక్రమార్కతో ఆటా నాయకుల భేటీ
అమెరికాలోని మేరీల్యాండ్ లో నిర్వహించనున్న 19వ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఆటా నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఆటా అటు అమెరికాలోనూ, ఇండియాలోనూ చేస్తున్న కార్యక్రమాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా. యుఎస్ -ఆటా భాగస్వామ్యం తో నిర్వహించే ఈ మహాసభల్లో పాల్గొనాలని ప్రత్యేకంగా కోరారు. ఇందుకు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎంని కలిసిన వారిలో జయంత్ చల్లాతోపాటు నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. అమెరికా పర్యటనలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సందర్శించేందుకు భట్టి విక్రమార్క ఆసక్తి చూపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆటా బృందానికి ఆయన సూచించినట్లు తెలిసింది.







