ఆంధ్రప్రదేశ్ కు ఇదో మైలురాయి : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
భారత తొలి సూపర్ ప్రైజర్ బెలూన్ (Super Pressure Balloon) ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) విజయవాడలో ఆవిష్కరించారు. రెబ్ బెలూన్ ఏరో స్పేస్ ఆధ్వర్యంలో ఈ బెలూన్ ను రూపొందించారు. పాలిమర్ నానోకాంపోజిట్ తో తయారు చేసిన దీనిని హైడ్రోజన్ తో నింపారు. నావిగేషన్ కోసం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మాడ్యూల్‌ను అమర్చారు. 50 కిలోల వరకు పేలోడ్‌ను మోయగల సామర్థ్యం ఉన్న ఈ బెలూన్ తో ఇతర సెన్సార్లతో పాటు ఆరు పేలోడ్ ల ను ఉంచి ప్రయోగించారు. ఈ ప్రయోగంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఇదో మైలురాయి అని ప్రశంసించారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లోనూ ఈ సాంకేతికత కనెక్టివిటీని విస్తరించగలదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రోత్సాహంతో భారత స్పేస్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఇది 40 బిలియన్ డాలర్ల ( సుమారు 4 లక్షల కోట్లు)కు చేరుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి







