బాలయ్య బర్త్ డేకు ఫ్యాన్స్ కు ట్రీట్
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) కెరీర్లో మరో భారీ మాస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న NBK111 సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand malineni)తో బాలయ్య కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి(Veera simhareddy) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. చారిత్రక యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన టీమ్‌తో కలిసి ముంబైలో తదుపరి షెడ్యూల్ కోసం లొకేషన్ రెక్కీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక అప్డేట్ను జూన్ 10, 2026న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో మరింత హైప్ తీసుకొచ్చింది. అదే రోజున సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో మంచు మనోజ్(manchu manoj) నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
హీరో- విలన్ మధ్య సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్(thaman) సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలయ్య(balayya) కెరీర్లోనే అత్యంత గ్రాండియర్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.







