మే 31న హ్యూస్టన్‌లో వైభవంగా ‘వాగ్గేయకారోత్సవం
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA), ‘స్వరభారతి‘ సంయుక్త ఆధ్వర్యంలో మే 31, 2026 (ఆదివారం) రోజు “వాగ్గేయకారోత్సవం” (Vaggeyakarotsavam) కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించనున్నారు. టెక్సాస్‌లోని రిచ్మండ్ నగరంలో గల ‘శంకర హాల్ – SVBF సౌత్’ వేదికగా ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ సంగీత, నృత్యోత్సవం సాగనుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఈవెంట్ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమ షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు.
కార్యక్రమ వివరాలు..
- తేది: మే 31, ఆదివారం
- ఉదయం 10:00 – 10:15: ప్రారంభోపన్యాసాలు, జ్యోతి ప్రజ్వలన.
- ఉదయం 10:15 – 11:00: శ్రీమతి శ్రీదేవి జోస్యుల బృందంచే ‘వాగ్గేయకార వైభవం – గోష్ఠి గానం’ (సమూహ గానం).
- ఉదయం 11:00 – సాయంత్రం 04:30: వాగ్గేయకారులకు నివాళులు – మినీ కచేరీలు (సమూహ, వ్యక్తిగత ప్రదర్శనలు).
- సాయంత్రం 04:30 – 05:30: టెక్సాస్ యువతీయువకులచే ‘వాద్య లహరి’ (కర్ణాటక సంగీత వాయిద్యాల ప్రదర్శన).
- సాయంత్రం 05:40 – r06:00: ‘కళా స్రవంతి స్కూల్ ఆఫ్ డాన్స్’ వారిచే సాంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శన.
సహకార కళాకారులు..
ఈ కార్యక్రమాల్లో ముకుంద్ జోస్యుల, ప్రణవ్ ప్రవీణ్, తేజస్ మురళి, మను వాఝా (వాయులీనం), నారాయణ్ శ్రీనివాసన్, విశాల్ సెట్లూర్, నాగ శ్రీనిధి, మహేశ్వర్ అజయ్‌కుమార్ (మృదంగం), బిజయ్ శంకర్ (ఘటం) లు సహకార కళాకారులుగా సేవలందించనున్నారు.
ఈ వేడుకలను టీసీఏ నూతన కార్యవర్గ బోర్డు (2026-27) ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కుడుముల, జనరల్ సెక్రటరీ రామకృష్ణ గోదావర్తి, ట్రెజరర్ జయశ్రీ బొందు, ఇతర కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం sridevi.josyula@gmail.com, cultural@tcahouston.org లేదా sitaram70@gmail.com ఈమెయిల్స్ ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి







