మే 31న న్యూయార్క్‌లో NYTTA ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
NYTTA: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA – నైట్టా) ఆధ్వర్యంలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘న్యూయార్క్ తెలంగాణ గుండె చప్పుడు’ అనే నినాదంతో ప్రవాస తెలంగాణీయుల సంస్కృతి, సాంప్రదాయాలు , ఐక్యతను చాటిచెప్పేలా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
కార్యక్రమ వివరాలు..
ఈ సాంస్కృతిక మహోత్సవం మే 31, 2026 (ఆదివారం) నాడు మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు న్యూయార్క్‌లోని ‘బెత్‌పేజ్ సీనియర్ కమ్యూనిటీ సెంటర్’ (Bethpage, NY) వేదికగా జరగనుంది.
ఇవి కూడా చదవండి
ప్రధాన ఆకర్షణలు..
తెలంగాణ వారసత్వాన్ని ప్రతిబింబించేలా వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.
ప్రముఖ కళాకారుడు మిమిక్రీ రమేష్ (Mimicri Ramesh) తన అద్భుతమైన లైవ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు.
చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ‘కిడ్స్ ఫ్యాషన్ షో’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు ఫ్లయర్‌లో ఇచ్చిన లింక్ ద్వారా తమ పిల్లల పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
కార్యక్రమం అనంతరం హాజరైన వారందరికీ ప్రత్యేక పండుగ విందు (Dinner) ఏర్పాట్లు చేశారు.
కార్యవర్గ ప్రతినిధులు..
ఈ వేడుకలను విజయవంతం చేయడానికి నైట్టా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు దోమల, ట్రెజరర్ డా. సౌమ్యశ్రీ చిత్తరి , బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగులతో కూడిన బృందం పర్యవేక్షిస్తోంది. న్యూయార్క్, పరిసర ప్రాంతాలలోని తెలుగు ప్రవాసులంతా తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని నైట్టా కార్యవర్గం పిలుపునిచ్చింది.
ఇవి కూడా చదవండి







