మే 23న ‘తానా’ సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఇన్ఫో సెషన్
TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic) విభాగం హైస్కూల్ విద్యార్థుల కోసం అద్భుతమైన సమ్మర్ ఇంటర్న్‌షిప్ (Summer Internships) అవకాశాలను ప్రకటించింది. విద్యార్థులు తమ కాలేజ్ ప్రొఫైల్‌ను మరింత బలంగా మార్చుకోవడానికి , కెరీర్ పట్ల స్పష్టత తెచ్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయోజనాలు వివరించడానికి మే 23, శనివారం రోజు ఒక ప్రత్యేక ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సెషన్‌ను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి
అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్ విభాగాలు..
ఈ సమ్మర్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు తమకు నచ్చిన , ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన క్రింది విభాగాలను ఎంచుకోవచ్చు:
- సోషల్ మీడియా ఇంటర్న్‌షిప్ (Social Media Internship)
- రిసెర్చ్ ఇంటర్న్‌షిప్ (Research Internship)
- లీగల్ ఇంటర్న్‌షిప్ (Legal Internship)
- గ్లోబల్ లీడర్షిప్ ఇంటర్న్‌షిప్ (Global Leadership Internship)
- బిజినెస్ ఇంటర్న్‌షిప్ (Business Internship)
- ఫైనాన్స్ ఇంటర్న్‌షిప్ (Finance Internship)
వివరాలు..
- తేదీ: మే 23, శనివారం
- సమయం: రాత్రి 7:00 PM EST / సాయంత్రం 6:00 PM CST / మధ్యాహ్నం 4:00 PM PST
హైస్కూల్ విద్యార్థులకు హై-ఇంపాక్ట్ కెరీర్ బిల్డింగ్‌కు ఉపయోగపడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ (Team TANA Mid-Atlantic) కోరింది. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ గూగుల్ లింక్ (https://tinyurl.com/2ddv9u76) ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి







