జైలర్2 వచ్చేదప్పుడేనా?
తమిళ సినీ పరిశ్రమలో సీక్వెల్స్‌కు ఉండే మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న కథకు కొనసాగింపుగా వచ్చే సినిమాలపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇప్పుడు అలాంటి అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం జైలర్2(Jailer 2). సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా మొదటి భాగం సృష్టించిన బాక్సాఫీస్ ప్రభంజనం కారణంగా సీక్వెల్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి.
మొదట ఈ సినిమాను సమ్మర్ సీజన్లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్ వ్యూహాత్మకంగా కొత్త రిలీజ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ రెండో వారాన్ని టార్గెట్ గా పెట్టుకుని రిలీజ్ డేట్స్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. వినాయక చవితి హాలిడే సీజన్‌తో పాటు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకునేలా ప్లానింగ్ జరుగుతోందని టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినా, ఈ రిలీజ్ డేట్ చుట్టూ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది.
ఇక ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), మోహన్‌లాల్(Mohanlal), ఎస్జే సూర్య(S. J. Suryah), రమ్య కృష్ణన్(Ramya Krishnan) వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటం విశేషం. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ ప్రెజెంటేషన్ కలయికగా తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.







