జూన్ 6న శాన్ ఆంటోనియోలో భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవం
MATA: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియోలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేసారు. ‘మన అమెరికా తెలుగు సంఘం‘ (MATA) తన 2వ మహాసభల (MATA 2nd Convention ’26) సందర్భంగా, ‘ఏకశిల ఫౌండేషన్ USA’ , స్థానిక స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యంతో ఈ ఆధ్యాత్మిక వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. భారత దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం నుండి స్వయంగా విచ్చేస్తున్న అర్చక స్వాములు, ఉత్సవ మూర్తులతో శాస్త్రోక్తంగా ఈ కల్యాణాన్ని జరిపించనున్నారు.
వివరాలు..
- తేదీ: శనివారం, జూన్ 6, 2026
- సమయం: ఉదయం 9:00 గంటలకు
- వేదిక: మహాలక్ష్మి హాల్, హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో (18518 Bandera Rd, Helotes, TX 78023).
- రిజిస్ట్రేషన్ ఫీజు: ఒక జంటకు $116 (Per Couple)
విశేషాలు..
భద్రాచలం క్షేత్ర సంప్రదాయం ప్రకారం, చేతితో దంచిన వరి బియ్యాన్నే కల్యాణ తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగించేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా వడ్లను సేకరించారు. భక్తులు చిన్న సంచులలో ఈ వడ్లను తీసుకువెళ్లి, రామనామ స్మరణ చేస్తూ చేతితో వలిచిన బియ్యాన్ని కల్యాణ తలంబ్రాల కోసం తీసుకురావాలని కోరారు. శాన్ ఆంటోనియోలోనే భద్రాచల క్షేత్ర అనుభూతిని పొందే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
సంప్రదించాల్సింది..
ఈ వేడుకలో పాల్గొనదలచిన వారు గూగుల్ ఫామ్ (https://forms.gle/DYeKVitjZPQi1esH8) ద్వారా రిజిస్ట్రేషన్ , స్పాన్సర్షిప్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం స్థానిక వాలంటీర్లు మహేందర్ నరాల (615-495-1872), జగదీష్ గుర్రాల (210-590-3647), లేదా రామ్ జూలుకుంట్ల (210-379-2244)లను సంప్రదించాల్సిందిగా కోరారు.






