కవిత జైలుకెళ్తే కేటీఆర్ రాజీనామా చేశారా? : రాంచందర్ రావు
కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ (BRS) ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchander Rao) మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు మాట్లాడారు. సంజయ్ కుమారుడు తప్పు చేస్తే, మంత్రి పదవికి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సంజయ్ ఏ తప్పూ చేయలేదని, ఒక వేళ ఆయన తప్పు చేసి ఉంటే తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. సొంత చెల్లెలు కవిత (Kavita) మద్యం కేసులో జైలుకెళ్తే, కేటీఆర్ గానీ, కేసీఆర్ (KCR) గానీ రాజీనామా చేశారా? అని నిలదీశారు. అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా సంజయ్ ను , బీజేపీని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సంజయ్ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉండాల్సిందే. అది న్యాయస్థానం చూసుకుంటుంది. ఒక వ్యక్తిపై కేసు నమోదు చేస్తే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం న్యాయపరమైన అంశం. ముందస్తు బెయిల్ రాకపోవడంతో సంజయ్ కుమారుడు సరెండర్ అయ్యాడు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే మీకేంటి బాధ? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి






