తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 42 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం (Government) మరో ఏడాది పొడిగించింది. గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లోకి ఉంటాయని జీవో ( GO)లో పేర్కొంది. పోలీసు (Police) తదితర యూనిఫామ్ సర్వీస్ లకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది (Year) పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి






