జూన్ 6 నుంచి ‘టాటా’ ఆధ్వర్యంలో జనరేటివ్ ఏఐ పై ఆన్లైన్ శిక్షణ
TATA: ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ NC (TATA) కెరీర్ గైడెన్స్ టీమ్ ఆధ్వర్యంలో ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్ ‘జనరేటివ్ ఏఐ’ (Generative AI)పై ప్రత్యేక ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘KKR GenAI Innovations’ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
శిక్షణ వివరాలు..
- తేదీలు: జూన్ 6, 2026 (శనివారం) నుండి జూన్ 28, 2026 (ఆదివారం) వరకు.
- సమయం: ఉదయం 10:00 AM నుండి 12:00 PM (EST) వరకు / 9:00 AM నుండి 11:00 AM (CST) వరకు.
- రిజిస్ట్రేషన్ గడువు: జూన్ 5, 2026.
నిర్వహణ సభ్యులు..
టాటా ప్రెసిడెంట్ వినోద్ కుమార్ కట్రగంట, వైస్ ప్రెసిడెంట్ నాగ గొంధి, సెక్రటరీ వెంకట్ కోగంటి, ట్రెజరర్ హేమ దాసరి , ఇతర బోర్డు సభ్యుల పర్యవేక్షణలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి.
ఆసక్తి గల వారు పోస్టర్‌లోని క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి మెంబర్షిప్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం హేమ దాసరి (+1 919-760-7434), వినోద్ కట్రగంట (+1 919-793-8204), లేదా శ్రీకాంత్ ఉప్పలపాటి (+1 919-946-1077)లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.






