మే 31న ‘మాటా’ ఆధ్వర్యంలో వర్చువల్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) మెడికల్ విభాగం ఆధ్వర్యంలో మే 31, 2026 (ఆదివారం) నాడు ఉన్నత స్థాయి కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూమ్ కాల్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య నిపుణులు ప్రసంగించనున్నారు.
ముఖ్య వక్తలు..
ఈ కార్యక్రమంలో నోబెల్ ప్రైజ్ నామినీ, 150కి పైగా అంతర్జాతీయ పేటెంట్లు కలిగిన డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి ముఖ్య వక్తగా పాల్గొని “అప్లికేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్” అనే అంశంపై ప్రసంగిస్తారు. అలాగే ప్రముఖ నిపుణులు డాక్టర్ వి. “బాల” బాలసుబ్రమణియన్ హెల్త్‌కేర్ రంగంలో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్లికేషన్స్, వాటి నైతికత” గురించి వివరించనున్నారు.
వివరాలు..
- తేదీ & సమయం: మే 31, 2026, సాయంత్రం 7:00 నుండి రాత్రి 9:00 వరకు (EST).
- రిజిస్ట్రేషన్: స్టూడెంట్స్‌కు రిజిస్ట్రేషన్ ఉచితం. హెల్త్‌కేర్ ప్రొవైడర్లు, నర్సులు మరియు ఫార్మసిస్ట్‌లకు నామినల్ ఫీజు ఉంటుంది.
- క్రెడిట్స్: ఈ ప్రోగ్రామ్ ద్వారా 2 CME క్రెడిట్స్ పొందే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను CME కమిటీ సభ్యులు కళ్యాణి బెల్లంకొండ, డాక్టర్ శాంతి ఎప్పనపల్లి, డాక్టర్ సంధ్య చినాల, డాక్టర్ రాజ్ కటార పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గలవారు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి లేదా tinyurl.com/OnlineCMEForHCP లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ‘మాటా’ ప్రతినిధులు కోరారు. మరిన్ని వివరాలకు +1 732-647-8716 నంబర్లో సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి






