మే 17న ‘MD vs DO’ పై TASC ఉచిత అవగాహన సదస్సు
TASC: దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (TASC) తమ 55వ వార్షికోత్సవ (ఎమరాల్డ్ జూబ్లీ) వేడుకల్లో భాగంగా ఒక ప్రత్యేక ఉచిత వెబినార్‌ను వైద్య విద్యార్థుల కోసం నిర్వహిస్తోంది. “MD vs DO: Your Journey to Becoming a Doctor” అనే అంశంపై ఈ కార్యక్రమం జరగనుంది.
ఉద్దేశ్యం..
వైద్య వృత్తిని చేపట్టాలనుకునే విద్యార్థులకు అల్లోపతి (MD) , ఆస్టియోపతిక్ (DO) మెడిసిన్ మధ్య ఉన్న వ్యత్యాసాలను, అలాగే మెడికల్ స్కూల్ ప్రయాణాన్ని వివరించడమే ఈ సెషన్ ముఖ్య ఉద్దేశ్యం.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 17, 2026 (ఆదివారం)
- సమయం: సాయంత్రం 5 PM నుండి 6 PM వరకు (PST)
- వేదిక: జూమ్ మీటింగ్ (చిత్రంలోని QR కోడ్ లేదా లింక్ ద్వారా జాయిన్ అవ్వవచ్చు)
ప్రసంగీకులు..
ఈ కార్యక్రమంలో నిపుణులైన అముల్య కులకర్ణి (లేక్ ఎరీ కాలేజ్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్) , దీక్ష పానుగంటి (కాలిఫోర్నియా నార్త్స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్) విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు.
మరింత సమాచారం కోసం టాస్క్ చైర్ వెంకట్ పెయ్యాల (310-427-0335) లేదా కో-చైర్ రాధా ఉప్పలపాటి (949-331-3275) గారిని సంప్రదించగలరు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.






