అహ్మదాబాద్ లో టాప్ ప్లేస్ కోసం బిగ్ ఫైట్..!
ఐపీఎల్ 2026లో(IPL 2026) భాగంగా ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో సమానంగా ఉన్న గుజరాత్ టైటాన్స్(GT), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే కాకుండా, ప్లేఆఫ్స్(IPL Play Offs) బెర్తును దాదాపు ఖరారు చేసుకుంటుంది. రెండు జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల భారీ తేడాతో గెలవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరోవైపు హైదరాబాద్ కూడా తక్కువేం కాదు. తన చివరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి తిరుగులేని దూకుడు మీద ఉంది. అయితే, హెడ్-టు-హెడ్ రికార్డ్స్ చూస్తే గుజరాత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు జరిగిన 7 మ్యాచ్‌ల్లో గుజరాత్ 5 సార్లు గెలవగా, హైదరాబాద్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. సన్‌రైజర్స్ తరపున అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్లో ఇప్పటికే 400 పరుగుల మార్కును దాటి టాప్ ఫామ్‌లో ఉన్నారు. గుజరాత్ తరపున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 462 పరుగులతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బౌలింగ్‌లో గుజరాత్‌కు రషీద్ ఖాన్ మ్యాజిక్ స్పిన్ ప్రధాన బలం కాగా, హైదరాబాద్ బ్యాటర్లను అడ్డుకోవడానికి కగిసో రబాడ (18 వికెట్లు) సిద్ధంగా ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్ వికెట్లు తీయడం మ్యాచ్ ఫలితాన్ని శాసించవచ్చు. ఇక ఈ పిచ్ మీద మోస్తరు పరుగుల వర్షం కురిసే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి






