మే 16న కనెక్టికట్ తెలుగు సంఘం ఉగాది సంబరాలు!
TACT: అమెరికాలోని కనెక్టికట్ తెలుగు సంఘం (TACT) ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు-2026 వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026 మే 16వ తేదీ శనివారం వెర్నాన్ సెంటర్ మిడిల్ స్కూల్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.
ప్రధాన ఆకర్షణ..
ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆధ్వర్యంలో ‘MLC’ (మ్యూజిక్, లిటరేచర్, కామెడీ) కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ కళాకారులు పాల్గొని అలరించనున్నారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు..
సాయి కుమార్, పవన్ కుమార్, కామాక్షి అంబటిపూడి, రామారావు, సాయి శ్రీచరణ్, అభిజ్ఞ, శివాని పిసుపాటి, నజీరుద్దీన్ తమ గాత్రంతో అలరించనున్నారు. ‘అదిరే’ అభి, గడ్డం నవీన్, ఐశ్వర్య, శాంతి కుమార్ తమ హాస్యంతో నవ్వులు పూయించనున్నారు. ఈ వేడుకలకు కోమలి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
సమయం: మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 7:00 వరకు కన్సర్ట్ నిర్వహించనున్నారు.
బంతి భోజనం: ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా బంతి భోజన ఏర్పాట్లు చేశారు.
వేదిక: Vernon Center Middle School, 777 Hartford Turnpike, Vernon, CT 06066.
నిర్వాహకులు..
టాక్ట్ ప్రెసిడెంట్ వెంకట్ చింతపల్లి, వైస్ ప్రెసిడెంట్ లిఖిత బండ్ల, సెక్రటరీ ఉష చేరుకూరి, ట్రెజరర్ శ్రవణ్ సూరంపూడి, జాయింట్ సెక్రటరీ అపర్ణ గుంటపల్లి, స్టేట్ కోఆర్డినేటర్ రియాజ్ షేక్.
ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించి ‘ఎర్లీ బర్డ్’ టికెట్ ధరలను పరిమిత కాలం పాటు పొడిగించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారు sulekha.com/tactugadi2026 ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఉష చేరుకూరి (+1 732-874-0355) లేదా లిఖిత బండ్ల (+1 443-881-8009) ను సంప్రదించగలరు.
ఇవి కూడా చదవండి






