మే 16న టంపా బేలో అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు
TAF: తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TAF), టంపా బే ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి “618వ జయంతి ఆరాధనోత్సవాలు” ఘనంగా నిర్వహించనున్నారు. 2026, మే 16వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు టంపాలోని హిందూ టెంపుల్ హాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.
అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచిత ప్రవేశం కల్పించడమే కాకుండా, ఉచిత భోజన సదుపాయం (Free Food) కూడా ఏర్పాటు చేశారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 16, 2026.
- సమయం: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు.
- వేదిక: Hindu Temple Hall, 5509 Lynn Rd, Tampa, FL 33624.
నిర్వాహకులు..
ఈ కార్యక్రమ నిర్వహణలో బాలా అమరావతి, విజయ పాథరు, శారదా మాంగిపూడి, శేఖర్ యెనమండ్ర, సుభద్రా గణపతిరాజు, ప్రశాంతి ఎర్రమేసెట్టి, అప్పలనాయుడు గర్భాన, సునీత మెడికొండ తదితర TAF కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. టంపా బే పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారు, అన్నమయ్య భక్తులు ఈ ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అసోసియేషన్ ఫౌండింగ్ మెంబర్స్, కమిటీ సభ్యులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి






