నార్త్ కరోలినాలో ‘టాటా’ తెలుగు బడి అడ్మిషన్లు ప్రారంభం.. మే 16 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్
TATA: అమెరికాలోని ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టాటా తెలుగు బడి’లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రవాసంలో ఉంటున్న తెలుగు పిల్లలకు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా గత 12 ఏళ్లకు పైగా ఈ తెలుగు బడి విజయవంతంగా కొనసాగుతోంది.
వివరాలు..
- శిక్షణ స్థాయిలు: ప్రారంభం, ప్రవర్తన, ప్రథానం, ప్రవాహం, ప్రవేశం అనే 5 స్థాయిలలో తరగతులు నిర్వహించనున్నారు.
- వేదికలు: కేరీ (Davis Drive Elementary School), హోలీ స్ప్రింగ్స్ (Zebra Robotics) ప్రాంతాల్లో తరగతులు జరుగుతాయి.
- సమయం: ప్రతి ఆదివారం తరగతులు ఉంటాయి.
- ఫీజు వివరాలు: మే 16వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 230 డాలర్లు (నగదు రూపంలో మాత్రమే) చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- సదుపాయాలు: ఫీజులోనే పాఠ్యపుస్తకాలు , స్నాక్స్ కూడా చేర్చారు.
నిర్వాహక బృందం..
ఈ తెలుగు బడికి ప్రిన్సిపాల్‌గా ప్రసాద్ కొమ్మరాజు, వైస్ ప్రిన్సిపాల్‌గా అరుణ తల్లూరి, జాయింట్ సెక్రటరీగా సాయి మహేష్ గడ్డంశెట్టి వ్యవహరిస్తున్నారు. అలాగే వినోద్ కుమార్ కట్రగంట (ప్రెసిడెంట్), నాగ గొంధి (వైస్ ప్రెసిడెంట్), వెంకట్ కోగంటి (సెక్రటరీ), హేమ దాసరి (ట్రెజరర్) నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను https://tinyurl.com/Telugubadi-26-27-registration లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని టీమ్ కోరింది. మన గుర్తింపు అయిన తెలుగు భాషను పిల్లలకు నేర్పించేందుకు ఇదొక చక్కని వేదిక అని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి






