నారా లోకేష్‌తో ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ భేటీ
APTS: నారా లోకేష్‌తో అద్భుతమైన సమావేశం – ఉండవల్లి నివాసంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్‌తో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్, నాట్స్ పూర్వ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ మన్నవ మోహన కృష్ణ భేటీ అయ్యారు.
రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత పటిష్టం చేసే దిశగా ఏపీటీఎస్ చేపడుతున్న కార్యక్రమాలు, సాంకేతిక ఆధారిత సేవల అమలుపై మన్నవ మోహన కృష్ణ వివరించారు. అలాగే మంగళగిరిలో APTS CSR నిధులతో అభివృద్ధి చేయనున్న ఆధునిక పార్క్ ప్రాజెక్ట్ గురించి కూడా మంత్రికి వివరించారు.
ప్రత్యేకంగా ప్రతి ఇంటికీ ప్రభుత్వ సేవలు చేరేలా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థ గురించి, అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు.
అమెరికాలో ఐటీ పారిశ్రామికవేత్తలతో మన్నవ మోహన కృష్ణ జరుపుతున్న చర్చలు, రాష్ట్రానికి ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు చేస్తున్న కృషిని నారా లోకేష్ అభినందించారు. గూగుల్ పెట్టుబడులు, క్వాంటమ్ వ్యాలీ వంటి ఆధునిక ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగింది. ప్రపంచ స్థాయి సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు.






