డిజైనర్ ఫ్రాకులో మెరిసిపోయిన అలియా
మహేష్ భట్(Mahesh Bhatt) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్(Alia Bhatt), తన నేచురల్ యాక్టింగ్ తో ఊహించని ఇమేజ్ ను సంపాదించుకుంది. బాలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లో కూడా ఛాన్సులందుకుంటూ బిజీగా ఉన్న అలియా భట్, సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ప్రత్యేకతను చాటుతూ గుర్తింపు దక్కించుకుంటుంది. అందులో భాగంగానే అలియా తాజాగాకేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఓ డిజైనర్ ఫ్రాకును ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఈ డ్రెస్ లో ఆలియా మరింత అందంగా మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు.






