మే 17న న్యూజెర్సీలో ‘నాట్స్’ సాంస్కృతిక సంబరాలు
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ‘నాట్స్ కల్చరల్ ఫెస్టివల్’ (NATS Cultural Festival) అత్యంత వైభవంగా జరగనుంది. మే 17, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక ఫోర్డ్స్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ప్రముఖుల సమక్షంలో వేడుక..
ఈ కార్యక్రమానికి పద్మశ్రీ మురళీ మోహన్ మాగంటి , పద్మభూషణ్ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు యువ గాయకులు హర్షిత యార్లగడ్డ, అద్వైత్ బొందుగుల తమ సంగీత ప్రదర్శనలతో అలరించనున్నారు.
కార్యక్రమ విశేషాలు..
- కళ్లు చెదిరే సాంస్కృతిక ప్రదర్శనలు.
- మాతృ దినోత్సవ (Mother’s Day) వేడుకలు.
- బాలల సంబరాలు , ‘తెలుగు అమ్మాయి’ ట్రోఫీ ప్రదానోత్సవం.
- షాపింగ్ స్టాల్స్ , రుచికరమైన విందు (Dinner Included).
- ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం.
వేదిక వివరాలు..
రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్, 1050 కింగ్ జార్జెస్ పోస్ట్ రోడ్, ఫోర్డ్స్, NJ 08863.
నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి , న్యూజెర్సీ చాప్టర్ టీమ్ సభ్యుల పర్యవేక్షణలో ఈ వేడుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల కోసం బిందు యలమంచిలి (908-240-3167), కిరణ్ మందాడి (732-491-1776) లేదా నాట్స్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.






